schedule Tuesday, July 07, 2026

కన్నెస్వామిపై కరుణ..!

calendar_today January 17, 2024
person dharshininews
కన్నెస్వామిపై కరుణ..!
కన్నెస్వామిపై కరుణ..! - వికలాంగుడి మోసుకుని కొండెక్కిన అయ్యప్ప భక్తుడు - చిన్నపాదం నడిచి భక్తిని చాటిన వైనం తాండూరు, దర్శిని ప్రతినిధి : అడ్డంకులు ఎదురైన భక్తుల కోసం అయ్యప్ప స్వామి ఎదరై సాయం అందిస్తారని ఆయన భక్తుడు దైవసత్యాన్ని చాటారు. శబరి మలైలో చిన్నపాదం యాత్రలో ఇబ్బందులు పడుతున్న వికలాంగున్ని మోసుకుని మొక్కు తీర్చి శభాష్ అనిపించుకున్నాడు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలానికి చెందిన యువ భక్తుడు. వివరాల్లోకి వెళితే... బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన అనిల్ కుమార్(కల్కి) హైదారాబాద్‌ హిప్సీగూడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ కంపెనిలో పనిచేస్తున్నాడు. 13వ సారి అయ్యప్ప మాల(గురుస్వామి) ధరించాడు. కాని అతని అక్క 'భర్త' మరణించడంతో మాలను తొలగించాడు. తరువాత సివిల్‌గా శబరికి బయల్దేరారు. ఈ క్రమంలో శివయ్య అనే ఓ వికలాంగ కన్నెస్వామి చిన్న పాదం నడించేందుకు ఇబ్బందులు పడుతుండడంతో చలించి పోయాడు. అయ్యప్ప స్వామిని స్మరించి వికలాంగ కన్నె స్వామిని భుజాన మోసుకున్నాడు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ కన్నెమోసుకుని చిన్న పాద యాత్ర పూర్తి చేశాడు. కష్టాల్లో ఉన్న స్వాములను అయ్యప్ప స్వామి సాయం అందిస్తారని ఉన్న దైవ సత్యాన్ని బషీరాబాద్‌కు చెందిన కల్కి నిజం చేస్తూ భక్తిని చాటుకోవడం పట్ల శభాష్‌ స్వామి అంటూ అభినందించారు. (కింద విడియో ఉంది చూడండి...) [video width="848" height="480" mp4="https://dharshininews.com/wp-content/uploads/2024/01/VID-20240117-WA0426.mp4"][/video] ఇదికూడా చదవండి... https://dharshininews.com/23203/