schedule Tuesday, July 07, 2026

జోహార్.. జోహార్... సుభాష్ చంద్రబోస్..!

calendar_today January 23, 2024
person dharshininews
జోహార్.. జోహార్... సుభాష్ చంద్రబోస్..!
జోహార్.. జోహార్... సుభాష్ చంద్రబోస్..! - కేవిసిఎస్ ఘనంగా జయంతి వేడుకలు - నేతాజీ విగ్రహానికి పూల మాలతో నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వాతంత్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ పాఠశాల (కేవిసిఎస్)లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ ప్రశాంత్కుమార్, డైరెక్టర్ సతీష్లతో పాటు విద్యార్థులు నేతాజి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూజలు చేసి.. పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విద్యార్థులు ర్యాలీగా బయల్దేరి శాంత్ మ హాల్ చౌరస్తా సమీపంలో ఉన్న నేతాజీ విగ్రహం వద్దకు వచ్చారు. పలువురు నేతలు, యజమాన్యం నేతాజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుభాష్ చంద్రబోస్ వేషాధారణలో చేపట్టిన ర్యాలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేతాజీ ఇచ్చిన 'మీరక్తాన్ని ధారపోయండీ.. మీకు స్వాతంత్రాన్ని ఇప్పిస్తాను' అనే పిలుపును నినాదాలుగా హోరేత్తించారు. మరోవైపు టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, పీడీఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు కూడా నేతాజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంటారం భద్రేశ్వర్, వడ్డె శ్రీనివాస్, రాజన్ గౌడ్, యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23358/