schedule Sunday, September 13, 2026

కాణిపాకం వినాయకుని సేవలో తాండూరు ఎమ్మెల్యే

calendar_today January 23, 2024
person dharshininews
కాణిపాకం వినాయకుని సేవలో తాండూరు ఎమ్మెల్యే
కాణిపాకం వినాయకుని సేవలో తాండూరు ఎమ్మెల్యే - సతీసమేతంగా పూజలు నిర్వహించిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుని సేవలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తరించారు. మంగళవారం కాణిపాకం వరసిద్ది వినాయకున్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సతీమణీ అరుణరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను మంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబీకులు, బందుమిత్రులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23364/