schedule Tuesday, July 07, 2026

జగదానందం..!

calendar_today January 23, 2024
person dharshininews
జగదానందం..!
జగదానందం..! - వైభవంగా సీతారాముల ఊరేగింపు - పాల్గొన్న చీకోటి ప్రవీణ్ కుమార్ - తరలిచ్చిన ఆశేష భక్తజన వాహిణి తాండూరు, దర్శిని ప్రతినిధి : అయోధ్య భవ్య రామ మందిరం, రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తాండూరులో నిర్వహించిన సీతారాముల ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. తాండూరులోని గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయోధ్య ఉత్సవాలు రెండో రోజు మంగళవారం వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా సాయంత్రం పట్టణంలోని స్టేషన్ హనుమాన్ నుంచి సీతారాముల ఊరేగింపు, నగర సంకీర్తనలు నిర్వహించారు. పట్టణంలోని కాళికాదేవి వద్ద జరిగిన ఊరేగింపులో హిందూ ధర్మ ప్రచారకులు. గో భక్తులు చీకోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అక్కడి నుంచి ఊరేగింపు పోటీ మహరాజ్ దేవాలయం, వినాయక చౌక్, ఇందిరా చౌక్, నెహ్రు గంజ్, మర్రిచెట్టు కూడలి, గాంధీచౌక్, భద్రేశ్వర చౌక్, మార్వాడి బజార్, సీతారాంపేట్, పాండురంగ దేవాలయం మీదుగా తిరిగి గోశాల వద్దకు చేరుకుంది. ఈ ఊరేగింపులో పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు ఊరేగింపులో నగర సంకీర్తనలు ఆకట్టకున్నాయి. జగదభి రామున్ని కీర్తిస్తూ ఆలాపించిన కీర్తనలు రంజింపజేశాయి. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23369/