schedule Sunday, September 13, 2026

తాండూరు పట్టణ సీఐగా సంతోష్ కుమార్

calendar_today January 25, 2024
person dharshininews
తాండూరు పట్టణ సీఐగా సంతోష్ కుమార్
తాండూరు పట్టణ సీఐగా సంతోష్ కుమార్ - సీఐ రాజేందర్ రెడ్డి నుంచి బాధ్యతల స్వీకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ సీఐగా సంతోష్ కుమార్ బదిలీ అయ్యారు. గురువారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో పాత సీఐ రాజేందర్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్  జిల్లాలో పనిచేస్తున్న సంతోష్ కుమార్ ను తాండూరు పట్టణ సీఐగా బదిలీ చేశారు. ఈ మేరకు సంతోష్ కుమార్ పట్టణ సీఐగా విధుల్లో చేరారు. ఇక్కడ పనిచేస్తున్న రాజేందర్ రెడ్డి కరోనా సమయంలో తాండూరు పట్టణ సీఐగా వచ్చారు. దాదాపు రెండేళ్ల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం సీఐ రాజేందర్ రెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేయిటింగ్లో ఉంచినట్లు సమాచారం. అదేవిధంగా విధుల్లో చేరిన నూతన సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ తాండూరులో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, నేరాలు, రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. నూతనంగా విధుల్లో చేరిన సీఐ సంతోష్ కుమార్ కు సీఐ రాజేందర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23404/