schedule Saturday, September 12, 2026

రేషన్ డీలర్లకు హెచ్చరిక..!

calendar_today January 29, 2024
person dharshininews
రేషన్ డీలర్లకు హెచ్చరిక..!
రేషన్ డీలర్లకు హెచ్చరిక..! - ఇకనుంచి ఆ పనిచేస్తే లైసెన్సులు రద్దు - అసవరమైతే క్రిమినల్‌ కేసులు కూడా - సమీక్షలో తాండూరు తహసీల్దార్ తారాసింగ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని రేషన్ డీలర్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లైసెన్సులను తప్పుగా వినియోగిస్తే రద్దు చేయడం, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సోమవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ మండలంలోని రేషన్ డీలర్లు తమ పరిధిలోనే షాపులను కొనసాగించాలన్నారు. లైసెన్స్ దారుల కుటుంభీకులు తప్ప మరెవరు కొనసాగించరాదన్నారు. బినామీల పేరుతో షాపులు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు సమోదు చేయిస్తామన్నారు. దీంతో పాటు డీలర్ షిప్ లైసెన్సులను రద్దు చేయిస్తామన్నారు. మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరుకులను సకాలంలో అందిచేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆన్ఐలు రాజారెడ్డి, బాలరాజు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23521/