schedule Saturday, September 12, 2026

మీ సలహాలు చాలు..!

calendar_today January 31, 2024
person dharshininews
మీ సలహాలు చాలు..!
మీ సలహాలు చాలు..! - ఎంజెడాపై రాద్దాంతపు విమర్శలే - వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు చైర్‌పర్సన్ చురకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం తరువాత చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సొంత పార్టీ వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లపై వాఖ్యలు చేశారు. ఏకపక్షంగా మున్సిపల్ ఎజెండాను రూపొందించారని వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ విమర్శలపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వ్యంగంగా ఖండించారు. ఇన్నాళ్లు సొంత పార్టీలో వర్గపోరు కారణంగానే అభివృద్ధి చేసుకోలేకపోయామన్నారు. మాజీ ఎమ్మెల్యేను ఇన్నాళ్లు తప్పుడు సలహాలతో పబ్బం గుడుపుకున్నారని అన్నారు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేకు సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎజెండాపై రాద్దాంతపు విమర్శలు చేశారని అన్నారు. ఎమ్మెల్యేకు సలహాలు అందించే స్థాయి వాళ్ళది కాదని, మీ సలహాలు ఇక మానుకోండని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వస్తున్న పుకార్లపై ప్రశ్నించగా నో కామెంట్ అంటూ.. కాలమే నిర్ణయిస్తుందని సమాధానాన్ని దాటవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23561/