schedule Tuesday, July 07, 2026

కాగ్నా పాత వంతెన కనుమరుగు..!

calendar_today February 1, 2024
person dharshininews
కాగ్నా పాత వంతెన కనుమరుగు..!
కాగ్నా పాత వంతెన కనుమరుగు..! - పాత దానిపై కొత్త వంతెన నిర్మాణం - డీపీఆర్ రెడీ చేసిన అధికారులు - అక్కడే కొత్త వంతెన ఎందుకోసమంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాగ్నానదిపై ఉన్న పాత వంతెన కనుమరుగు కాబోతోంది. దాని స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిజాం కాలంలో కాగ్నానదిపై నిర్మించిన వంతెన ఎంతో చారిత్రాక్మమైనదిగా నిలిచింది. 2016 సంవత్సరం నుంచి ప్రతి యేడాది కురుస్తున్న వర్షాలకు పురాతన వంతెన కూలి పోతూ వస్తోంది. దాని సమీపంలోనే రూ. 16 కోట్లతో కొత్త నిర్మించడం, అందుబాటులోకి తేవడంతో పాత వంతెన వినియోగంలో లేకుండా పొయింది. కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాలను అనుసంధానం చేయడంలో కాగ్నా వంతెన కీలకంగా నిలిచింది. కర్ణాటక రాష్ట్రం చించొల్లి నుంచి తాండూరు పట్టణం, కోడంగల్‌ ప్రాంతాల మీదుగా జాతీయ రహదారిని అనుసంధానం చేస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్ 167(ఎన్) కింద కాగ్నానది మీదుగా జాతీయ రహదారిని నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఈ మార్గంలో ఫోర్‌ లైన్ వే నిర్మాణానికి దృష్టి సారిస్తోంది. కాగ్నా నదిపై దీనిని నిర్మించేందుకు డీపీఆర్ సిద్దం చేశారు. కొత్త వంతెనకు సమీపంలో ఉన్న పాత వంతెనను తొలగించి దాని స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలని నిర్ణయించారు. పాత వంతెన కూల్చడం, కొత్త వంతెన నిర్మించడం పట్ల పలువురు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి.. https://dharshininews.com/23577/