schedule Tuesday, July 07, 2026

దౌర్భాగ్యం, అన్యాయం..!

calendar_today February 7, 2024
person dharshininews
దౌర్భాగ్యం, అన్యాయం..!
దౌర్భాగ్యం, అన్యాయం..! - కాంగ్రెస్‌ పాలనపై పైలెట్ ఫైర్ - ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింతపై ఆగ్రహం - 13న చలో నల్గొండను జయప్రదం చేయండి - తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే స్వీట్ చాలేంజ్ - అభివృద్ధి జీవోలను ఫేక్ అని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్భాగ్యం, అన్యాయ పరిస్థితులు ఏర్పడ్డాయని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాటి సాధించుకున్న తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాటు హక్కుల కోసం తలొగ్గకుండా పాలన చేశారని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాగునీరు అందించే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమయ్యిందన్నారు. తాజాగా మోస పూరిత హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతగాక మన సాగునీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రజలకు, రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. కృష్ణా బోర్డు చేతుల్లోకి శ్రీశైలం ప్రాజెక్టు వెళ్లడంతో పాలమూరు రంగారెడ్డికి పథకానికి సాగునీరు అందడం కష్టమే అన్నారు. వికారాబాద్ జిల్లాలో 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో 2 విడతలో నియోజకవర్గానికి సాగునీరందే అవకాశం ఉండేందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనికి 1లక్ష 50 ఎకరాలకు సాగునీరు పొందే విషయాన్ని మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని, వ్యతిరేకిస్తుందన్నారు. ప్రజల, రైతుల పక్షాన మన ప్రాజెక్టులపై హక్కులను చాటుకునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సభకు తాండూరు నుంచి భారీగా జనాలను తరలించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇవ్వకుండా జాప్యం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వానికి తేది ఇంకా రాలేదన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ ఇంకా ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం బస్తాలకు బోనస్ ఇస్తామని చెప్పిన హామికి దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ : అభ్యర్థి గెలుపు ఖాయమని. కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. ఎన్నికల్లో ఎంపీ రంజిత్ రెడ్డి గెలుపుకోసం బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యేకు స్వీట్ చాలెంజ్ మరోవైపు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.1600 కోట్ల అభివృద్ధి నిధులను సాధించడం జరిగిందని గుర్తుచేశారు. ఈ పనులను ఎక్కడా ఆపేది లేదన్న కాంగ్రెస్ తాండూరు ఎమ్మెల్యే ఇప్పుడు పనులకు ఎందుకు బ్రేక్ వేశారో చెప్పాలన్నారు. తాను సాధించిన అభివృద్ధి జీవోలను ఫేక్ జీవోలు అంటూ ప్రచారం చేయడం తగదన్నారు. అవి ఫేక్ జీవోలు అని నిరూపిస్తే రాజకీయ సన్యాయం తీసుకుంటానని సవాల్ చేశారు. ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్ధమన్నారు. ఎమ్మెల్యేగా రూ. 13 కోట్లు సాధించడం అభినందనీయమని, అభివృద్ధికి కృషి చేస్తే స్వాగతిస్తామన్నారు. అంతేకాని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై రాజకీయ కక్ష్యలకు పాల్పడితే ఊరుకునేది. లేదన్నారు. అంతారం గ్రామంలో చెన్నప్ప అనే గ్రామ కార్యకర్తకు చెందిన బెల్టు షాపుపై దాడులు చేసి కేసులు నమోదు చేయడాన్ని కక్ష్య పూరిత రాజకీయాలను ఉదహరించారు. చూస్తే అందరిని సమానంగా చూడాలన్నారు. వెంట ఉన్న దుండగులను చూసి రాజకీయ కక్ష్యలకు పాల్పడరాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, విజయ్ కుమార్, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షులు సర్సిరెడ్డి, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23667/