schedule Tuesday, July 07, 2026

సెల్‌ నెంబర్ రాసుకోండి..!

calendar_today February 13, 2024
person dharshininews
సెల్‌ నెంబర్ రాసుకోండి..!
సెల్‌ నెంబర్ రాసుకోండి..! - పథకాల దరఖాస్తులకు సంప్రదించండి - పార్టీ కార్యాలయం నుంచి కార్యకలాపాలు - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సోషల్ మీడియా వేధికగా చేసిన వాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ప్రభుత్వ పథకాల అర్హులు దరఖాస్తులు చేసుకునేందుకు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులుగా ఉన్న హబీబ్ లాల ఓ మీడియాతో మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలో కొందరు డబ్బులు తీసుకుని కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్, సీఎంరిలీఫ్ ఫండ్, ఓటరు దరఖాస్తులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేందుకు సంప్రదించాలని సూచించారు. పార్టీ కార్యాలయంలోనే ఫారాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎమ్మెల్యే ఈ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారని అన్నారు. ఎవరైనా లబ్దిదారులు పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పణకు సంప్రదించవచ్చన్నారు. సెల్‌ నెంబర్ రాసుకోండని 9010870718 కూడా చెప్పారు. ఇక్కడి వరకు భాగానే ఉన్న అధ్యక్షుడి వాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం పార్టీ కార్యాలయంలో సంప్రదించమేంటని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి వెళ్లి చైతన్య పరచాలని, లబ్దిదారులకు కార్యాలయానికి పిలుపించుకోవడం రాజకీయం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మీసేవ కార్యాలయాలు, అధికార యంత్రాంగాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పలువురు అధికారులు సైతం అధ్యక్షుడి వాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. వీడియో కోసం కింద లింక్ లో చూడండి https://youtu.be/7aLekVF9OIc ఇదికూడా చదవండి... https://dharshininews.com/23833/