schedule Tuesday, July 07, 2026

బీజేపీ జిల్లా మహిళ మోర్చ కమిటీ ఖరారు

calendar_today March 16, 2024
person dharshininews
బీజేపీ జిల్లా మహిళ మోర్చ కమిటీ ఖరారు
బీజేపీ జిల్లా మహిళ మోర్చ కమిటీ ఖరారు - కమిటిలో తాండూరు మహిళ నేతలకు చోటు - ప్రకటించిన బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ మహిళ మోర్చ వికారాబాద్ జిల్లా కమిటి ఖరారయ్యింది. జిల్లా అధ్యక్షురాలుగా వికారాబాదుకు చెందిన యాస్కీ శిరీష ఎన్నికకాగా కమిటిలో తాండూరు, పరిగి, ధారూర్, కుల్కచర్ల మండలాకు చెందిన మహిళ నేతలకు చోటు దక్కినట్లు జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా మాధవి (వికారాబాద్), విజయలక్ష్మీ (ధారూర్), రేణుక ((తాండూరు), లావణ్య(తాండూరు), ప్రధాన కార్యదర్శులుగా పి. మంజుల(వికారాబాద్), సౌమ్యారెడ్డి(కుల్కచర్ల), ఉమాదేవి (తాండూరు), కార్యదరు లుగా గిరిజ(వికారాబాద్), సౌందర్య(పరిగి), మహేశ్వరి(పట్లూరు)లను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. జిల్లా కమిటిలో మహిళలకు అవకాశం కల్పించడం పట్ల బీజేపీ జిల్లా కమిటికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు బీజేపీ గెలుపుకు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. లోకల్ యాడ్... ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/24419/