schedule Tuesday, July 07, 2026

మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిది

calendar_today July 7, 2026
person dharshininews
మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిది
మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిది - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి - వార్డుల్లో వన మహోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత అందరిది అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. మంగళవారం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 14, 15, 16, 17 వార్డులలో స్థానిక కౌన్సిలర్లు, మైప్మా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్‌పర్సన్ నీరజబాల్ రెడ్డి హాజరై ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు ప్రధానం అని అన్నారు. అందరు ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని అన్నారు. నాటిన మొక్కలను బాధ్యత సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43699/