schedule Tuesday, July 07, 2026

నేడు బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశం

calendar_today March 30, 2024
person dharshininews
నేడు బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశం
నేడు బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశం - సమావేశానికి ముఖ్య అతిథితులు ఎవరంటే..? - కార్యకర్తలకు చేసిన ఏర్పాట్లు ఇవే తాండూరు, దర్శిని ప్రతననిధి: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తాండూరులో తొలిసారి నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సన్నహాక సమావేశంపై అందరి దృష్టి ఏర్పడింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కందనెల్లి సమీపంలోని జీపీఆర్‌ గార్డెన్‌లో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. ఈ సమావేశానికి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఅర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులు హజరవుతున్నారు. మధ్యాహ్నం 3-30 గంటలకు సమావేశం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సమావేశానికి వస్తున్న ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తల కోసం భోజనాలతోపాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24556/