schedule Wednesday, September 16, 2026

వైభవంగా గీతా యజ్ఞ, పారాయణం

calendar_today April 1, 2024
person dharshininews
వైభవంగా గీతా యజ్ఞ, పారాయణం
వైభవంగా గీతా యజ్ఞ, పారాయణం - భక్తిశ్రద్ధలతో హోమం, భక్తులకు అన్నదానం - పాల్గొన్న నేతలు, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని పాండురంగ స్వామి దేవాలయంలో గీతా యజ్ఞ, గీతాపారణ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సోమవారం కొండా మాధవ రెడ్డి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దామర్ చెడ్ కు చెందిన శివానంద్ స్వామి హాజరై గీతా పారాయణం, యజ్ఞ విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమానికి నాగలక్ష్మీ, అంజిల్ రెడ్డిలతో పాటు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, కౌన్సిలర్ సాహులత, ఆలయ ధర్మకర్త మేడిశెట్టి చంద్రకళ, జగన్నాథం, భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం నిర్వహించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24601/