schedule Wednesday, September 16, 2026

రైతు దీక్షకు బీఆర్ఎస్ సిద్దం..!

calendar_today April 5, 2024
person dharshininews
రైతు దీక్షకు బీఆర్ఎస్ సిద్దం..!
రైతు దీక్షకు బీఆర్ఎస్ సిద్దం..! - నియోజకవర్గ స్థాయిలో నిర్వహణ - లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఏర్పాట్లు - తరలిరావాలంటున్న పార్టీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేపట్టేందుకు సిద్దమయ్యింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తాండూరు నియోజకవర్గ స్థాయిలో శనివారం ఉదయం 11గంటలకు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ సీనీయర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండల రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25122/