schedule Tuesday, July 07, 2026

రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్‌

calendar_today April 7, 2024
person dharshininews
రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్‌
రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్‌ - రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రాజ్‌పుత్‌ సమాజ సంఘ అధ్యక్షులుగా మహేష్‌ ఠాకూర్ ఎన్నికయ్యారు. రెండోసారి సంఘం సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని భవానీ మాత ఆలయంలో కమిటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజ్‌పుత్‌ సంఘ అధ్యక్షులుగా మహేష్ ఠాకూర్‌ను మరో సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సమాజ సభ్యులు మాట్లాడుతూ ఈసారి గతంలో కన్నా ఇంకా మెరువైన సేవలు అందించాలని కోరారు. ప్రతిక్షణం అధ్యక్షుడికి వెన్నంటూ ఉండి ప్రతి కార్యకలాపాలలో పాలుపంచుకున్న మహేష్ ఠాకూర్ అధ్యక్ష కమిటీ సభ్యులకు కూడా అభినందనలు తెలిపారు. కమిటీ సభ్యుల పదవి కాలం కూడా ముగియడంతో అనివార్య కారణాల వల్ల కమిటీ సభ్యులను ఎన్నుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. త్వరలో కమిటీ సభ్యుల పేర్లను వెల్లడిస్తామని సమాజా అధ్యక్షులు, సమాజ సభ్యులు తెలిపారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన మహేష్ ఠాకూర్ ని శాలువా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజం పెద్దలు, యువకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25304/