schedule Tuesday, July 07, 2026

స్పీడ్‌గా పార్లమెంట్ ప్రక్రియ

calendar_today April 7, 2024
person dharshininews
స్పీడ్‌గా పార్లమెంట్ ప్రక్రియ
స్పీడ్‌గా పార్లమెంట్ ప్రక్రియ - తాండూరుకు 277 ఈవీఎం యంత్రాల రాక - నేడు స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచే ఏర్పాట్లు - పార్టీ ప్రతినిధులను ఆహ్వానించిన ఆర్డీఓ శ్రీనివాస్‌ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ స్పీడ్‌గా కొనసాగుతోంది. సహాయ ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బందికి ఇటీవలే శిక్షణ తరగతులను నిర్వహించి పూర్తి చేశారు. తాజాగా తాండూరు అసెంబ్లీ సిగ్మెంట్‌ కోసం 277 ఈవీఎం యంత్రాలతో పాటు రిజర్వ్ యంత్రాలను కేటాయించగా వాటిని తాండూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఓ ప్రకటనలో మాట్లాడుతూ నేడు తాండూరుకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను తాండూరుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. వికారబాద్‌లోని గోడౌన్‌ నుంచి తాండూరుకు తరలించనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్‌ స్కూల్‌లోని స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎం యంత్రాలను భద్రపరిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి తాండూరులోని రాజకీయ పార్టీల ప్రతినిధులు తరలిరావాలని విజ్ఙప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25307/