schedule Tuesday, July 07, 2026

ఆర్యవైశ్య సంఘం పోలింగ్ థ్రిల్లింగ్...!

calendar_today April 7, 2024
person dharshininews
ఆర్యవైశ్య సంఘం పోలింగ్ థ్రిల్లింగ్...!
ఆర్యవైశ్య సంఘం పోలింగ్ థ్రిల్లింగ్...! - ఉదయం ఎన్నికలు, మధ్యాహ్నం కౌంటింగ్ - అధ్యక్షులుగా అల్లం శ్రీనివాస్ భారీ మెజార్టీ - ప్రత్యర్థి ప్యానల్‌ క్లీన్‌ స్వీప్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు థ్రిల్లింగ్‌గా జరిగాయి. నూతన కార్యవర్గం కోసం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం పోలింగ్, మధ్యాహ్నం కౌటింగ్ నిర్వహించారు. 2024-26 సంవత్సరానికి సంబంధించి సంఘం ఎన్నికలు జరిగాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో అలంపల్లి శ్రీనివాస్ ప్యానల్, దేవగారి రమేష్ ప్యాసల్ పోటీ పడ్డారు. అధ్యక్షులుగా అలంపల్లి శ్రీనివాస్ ప్రత్యర్థి దేవగారి రమేష్పై 308 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా ఆయన ప్యానల్‌కు చెందిన ఉపాధ్యక్షులుగా ఆకారం శివకుమార్ 409 ఓట్లతో, కార్యదర్శులుగా కోడూరు వినోద్ కుమార్ 424 ఓట్లతో, ఉప కార్యదర్శిగా కుంచం సంపత్ కుమార్ 425 ఓట్లతో, కోశాధికారిగా రొంపల్లి సంతోష్ కుమార్ 388 ఓట్లతో విజయ ఢంకా మోగించారు. ఎన్నికల్లి ప్రత్యర్థి దేవగారి రమేష్‌ ప్యానల్‌ క్లీన్ స్వీప్ అయ్యింది. అనంతరం ఎన్నికల్లో గెలిచిన వారికి ఎన్నికల అధికారి కోస్గి తిప్పయ్య నియామకపత్రాలను అందజేశారు. అనంతరం ఎన్నికల్లో గెలిచిన నేతలను సత్కరించడంతో పాటు ఊరె గింపు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25312/