schedule Saturday, September 12, 2026

భక్తుల కొంగు బంగారం కట్టమైసమ్మ తల్లి

calendar_today April 8, 2024
person dharshininews
భక్తుల కొంగు బంగారం కట్టమైసమ్మ తల్లి
భక్తుల కొంగు బంగారం కట్టమైసమ్మ తల్లి - ఆలయ అభివృద్ధికి అందరు సహకరించాలి - మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ - ఆదర్శనగర్‌ ఆలయంలో అమావాస్య పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ పాత కుంటలో వెలసిన శ్రీ కట్టమైసమ్మ తల్లి కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతుందని మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. సోమవారం ఆలయంలో అమ్మవారికి అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం, భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో వెలసిన అమ్మవారు ఎంతో మహిమగల తల్లి అన్నారు. భక్తుల కోరికలు తీరుస్తూ కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారని అన్నారు. అమ్మవారి దయతో ఆలయ అభివృద్ధితో తన వంతు సహాయంగా ఆలయ సేడ్డు నిర్మాణంకోసం రూ. 1లక్ష 14వేలు అందించినట్లు గుర్తుచేశారు. ఆలయ అభివృద్ధికి అందరు సహకరించాలన్నారు. అదేవిధంగా గత 16 నెలలుగా ప్రతి అమావాస్యకు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్, కుజల నర్సింలు కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుదాకర్, ,గోశాల సభ్యులు గాండ్లశివరాజ్ ,గోపాల కృష్ణ, ప్రకాష్ కుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు చంద్రకాంత్ స్వామి, భక్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25335/