schedule Tuesday, July 07, 2026

భద్రేశ్వర వైభోగం..!

calendar_today April 9, 2024
person dharshininews
భద్రేశ్వర వైభోగం..!
భద్రేశ్వర వైభోగం..! - జాతర ఉత్సవాలు షురూ - రథచక్రాల పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - అందిరికి మంచి జరగాలని ఆకాంక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం వద్ద స్వామి వైభోగం సంతరించుకుంది. ప్రతి యేడాది ఉగాది పర్వదినాన భద్రేశ్వర స్వామి రథచక్రాలకు పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం భద్రేశ్వరుడి జాతర ఉత్సవాలను రథచక్రాల పూజలతో ప్రారంభించారు. దేవాలయ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త, సమాజం సభ్యులు హాజరయ్యారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని రథచక్రాల ఇరుసులను బయటకు తీశారు. కూడలిలో చక్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఉత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ యేడాది అందరికి మంచి జరిగాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆసక్తికరంగా పంచాంగ శ్రవణం దీంతో పాటు ఆలయ ఆవరణలో శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం వినించారు. ఈ సారి రైతాంగానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎంత' పనిచేసినా ప్రభుత్వ పాలనకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు. ఎండలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని పండితులు నీలకంఠ స్వామి వినిపించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బంటారం లావణ్య, నాయకులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, పటేల్ కిరణ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి, వెంకన్నగౌడ్, వీరశైవ సమాజం సభ్యులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25380/