schedule Tuesday, July 07, 2026

రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం

calendar_today April 12, 2024
person dharshininews
రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం
రేపు భద్రేశ్వర జాతర యంత్ర ప్రదర్శన వేలం - దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో యంత్ర ప్రదర్శన వేలం రేపు నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి యేడాది జాతరలో రంగుల రాట్నం, చిన్నారుల ఆటవస్తువల యంత్రాలకు వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈసారి కూడా ఏర్పాటు చేసే యంత్రాల ప్రదర్శనకు శనివారం ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో వేలం జరుగుతుందన్నారు. ఈ వేలంలో ఆసక్తిగల వ్యాపారులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25441/