schedule Tuesday, July 07, 2026

చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..!

calendar_today April 22, 2024
person dharshininews
చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..!
చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..! - నిరూపణ కోసం ఎక్కడికైనా వస్తా - బీజేపీ నేతలపై రంజిత్ రెడ్డి ఫైర్ - చేవేళ్లలో కాషాయం ఖతమే.. తాండూరు, దర్శిని డెస్క్ : రాజకీయ కక్షతో పదే పదే చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రంజిత్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఆరోపణలు నిరూపిస్తామంటే ఎక్కడికైనా వస్తానని సవాల్ చేశారు. సోమవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ రంజిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గుడ్ల స్కాం, దేవాలయ భూముల కబ్జా చేశారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఎంపీ రంజిత్ రెడ్డి ఖండించారు. కావాలని పదే పదే చెత్త ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలు నిరూపించేందుకు బీజేపీ సిద్దమైన ఎక్కడికైనా రావాడానికి రేడీ అంటూ బీజేపీ నేతలకు సవాల్ చేశారు. వీడియోలు ప్రచారం చేయడం మానుకోవాలని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మరోవైపు చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఆదరణ లభించిందని అన్నారు. సంక్షేమాన్ని, హామిలను విస్మరించిన బీజేపీని నమ్మడం లేదన్నారు. సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీకి వ్యతిరేకంగా ఆరు గ్యారెంటీలతో సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో కాషాయం ఖతమే అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ఓబీసీ డిపార్టెంట్ కన్వినర్ సునితా సంపత్, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహరాజ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25710/