schedule Saturday, September 12, 2026

భద్రేశ్వరునికి సాక్షిగా..!

calendar_today April 23, 2024
person dharshininews
భద్రేశ్వరునికి సాక్షిగా..!
భద్రేశ్వరునికి సాక్షిగా..! - భక్తుల ఆకలితీర్చిన వీరశైవ యువదళ్ - దేవాలయంలో అన్నదానం ప్రారంభం - అభినందించిన సమాజం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వరుని సన్నిధిలో స్వామి సాక్షిగా వీరశైవ యువదళ్ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం పౌర్ణమితో పాటు అక్కమావేది జయంతి సందర్భంగా తాండూరు వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంకు చెందిన బస్వరాజ్ సహాకారంతో భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన చేత ప్రారంభించారు.   ఈ సందర్భంగా బస్వరాజ్ తో పాటు యువదళ్ సభ్యులు మాట్లాడుతూ భద్రేశ్వర దేవాలయంలో పూర్వం దాసోహం అనే సంప్రదాయం ఉండేదని గుర్తుచేశారు. దానిని త్వరలో మళ్లీ ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. వీరశైవ యువదళ్ నూతనంగా ఏర్పాటై ప్రతి పౌర్ణమికి అన్నదానం చేయాలని నిర్ణయించడం జరిగిందని, దీనికి అందరు సహకరించి ముందుకు సాగించాలని విజ్ఞప్తి చేశారు.   అనంతరం అన్నదానానికి సహకరించిన బస్వరాజ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువదళ్ అధ్యక్షులు అడికి శశాంక్, మఠం జగదీశ్వర్, ఉపాధ్యక్షులు రాయల్ రవికుమార్, శివప్రసాద్, గాండ్ల పరమేష్, ప్రధాన కార్యదర్శి మద్రిక చంద్రకాంత్, కోశాధికారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25722/