schedule Tuesday, July 07, 2026

దర్శిని ఎఫెక్ట్..!

calendar_today April 24, 2024
person dharshininews
దర్శిని ఎఫెక్ట్..!
దర్శిని ఎఫెక్ట్..! - మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ - 'వసూళ్లే టార్గెట్‌'కు స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : దర్శిని కథనానికి తాండూరు మున్సిపల్ అధికారులు స్పందించారు. మంగళవారం దర్శనిలో తాండూరు మున్సిపల్‌లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై కథనం రాసిన సంగతి తెలిసిందే. వసూళ్లే టార్గెట్ అనే శీర్షికన వచ్చిన కథనానికి మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి స్పందించారు. మున్సిపల్లో పనిచేస్తున్న సిబ్బంది బరియల్ గ్రౌండ్ అనే యాప్ లో ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి తాజాగా మరణించినట్లు డెత్ సర్టిఫికెట్ నమోదు చేయడాన్ని కథనంతో వెలుగులోకి తీసుకరావడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి వివరాలను ఆరా తీశారు. మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న రవి, మురళీ అనే సిబ్బంది ద్వారా ఈ సంఘటన జరిగినట్లు గుర్తించారు. దీంతో కమీషనర్ ఇద్దరికి మెమోలు జారి చేశారు. దీంతో పాటు బరియల్ గ్రౌండ్ ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్ ను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25745/