schedule Saturday, September 12, 2026

బడుల బలోపేతానికి దృష్టి

calendar_today April 27, 2024
person dharshininews
బడుల బలోపేతానికి దృష్టి
బడుల బలోపేతానికి దృష్టి - పునఃప్రారంభం నాటికి మౌళిక సదుపాయాలు - మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు సహాకారంతో ప్రభుత్వ బడుల బలోపేతానికి దృష్టిసారించడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం సాయిపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కమీషనర్ సందర్శించారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి ఆమ్మ ఆదరణ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణలో 27 పాఠశాలల్లో 15పాఠశాలలో మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిందన్నారు. తాగునీరు కోసం రూ. 1 లక్ష, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.50 వేలు, విద్యుత్ మరమ్మత్తుల కోసం రూ.25 వేలు మంజూరు చేసిందని వెల్లడించారు. రెండో విడతలో రూ. 1 లక్షకు పైగా అవసరమున్న పాఠశాలలను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ 15 పాఠశాలల్లో జూన్ లో పాఠశాలల పునః ప్రారంభం నాటికి పనులు పూర్తి చె వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రమేష్, స్కూల్ హెచ్ఎం పెరుమాళ్ల నర్సింహారెడ్డి, ఆమ్మ ఆదరణ కమిటి సభ్యులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25867/