schedule Tuesday, July 07, 2026

పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు

calendar_today May 8, 2024
person dharshininews
పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు
పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు - ఈనెల 10వ తేదీ వరకు అవకాశం - తాండూరు ఆర్టీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువు పెంచడం జరిగిందని తాండూరు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యోగులు ఓటు వేసేందుకు బుధవారం వరకు గడువు ఉండగా దానిని ఈనెల 10వ తేదీ వరకు పొడగించినట్లు వెల్లడించారు. పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1638 మందికి గాను 1334 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26285/