schedule Tuesday, July 07, 2026

యువత ప్రతిభ ఆదర్శనీయం

calendar_today July 7, 2026
person dharshininews
యువత ప్రతిభ ఆదర్శనీయం
యువత ప్రతిభ ఆదర్శనీయం - అష్టావధాని ధీరజ్ సాయికి సన్మానం - గిన్నిస్ రికార్డు హోల్డర్ మడపతి విజయ్ కి సత్కారం - కురుమ సంఘం ఆధ్వర్యంలో అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విభిన్న రంగాలలో ప్రతిభను చాటుకుంటున్న తాండూరు యువత ఆదర్శనీయంగా నిలవడం హర్షణీయమని కురుమ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో అష్టావధానంలో ప్రతిభ చాటిన చెంగోల్ గ్రామానికి చెందిన ధీరజ్ సాయి, హుబ్లింగ్ లా పాస్ లధాఖ్ ఎత్తయిన శిఖరం అధిరోహించిన తాండూరు భద్రేశ్వర దేవాలయ పూజారి మడపతి విజయ్ కుమార్ కుమారుడు మడపతి వినయ్ కుమార్ లను ఘనంగ సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత చదువుతో పాటు కళా, నైపుణ్య రంగాల్లో సత్తా చాటడం గర్వకారణం అని అన్నారు. ధీరజ్ సాయి అష్టావధానంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, వినయ్ కుమార్ మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. వీరిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం డివిజన్ అధ్యక్షుడు నాగారం జగదీష్, పట్టణ కురువ సంఘం అధ్యక్షులు మరాఠి నర్సింలు, ఉపాధ్యక్షులు మిట్టి మహేష్, కరణ్ కోట్ నాగప్ప, చీమల నరసింహులు, ఇందూరు మల్లేశం, పూజారి పాండు, మెట్లకుంట వెంకటేశం, బాలప్ప, అగనూరు గుండప్ప, వీరేశం, షాపూర్ హనుమంతు, సంగం కలాం మల్లేశం, కుమ్మరపల్లి వెంకటయ్య, జట్ట యాదగిరి, కురువ సంఘ సభ్యులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43706/