schedule Tuesday, July 07, 2026

సమ సమాజ స్థాపకుడు బసవేశ్వరుడు

calendar_today May 10, 2024
person dharshininews
సమ సమాజ స్థాపకుడు బసవేశ్వరుడు
సమ సమాజ స్థాపకుడు బసవేశ్వరుడు - ఘనంగా జయంతి ఉత్సవాలు - నివాళులు అర్పించిన న్యాయవాదుల సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమ సమాజ స్థాపనలో జగజ్యోతి బసవేశ్వరుని మార్గదర్శకుడని తాండూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. శుక్రవారం తాండూరు కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వరుని జయంతిని జరుపుకున్నారు. అసోసియేషన్ కార్యాయలంలో బసవేశ్వర చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. బసవేశ్వరునికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు కృషి చేసిన బసవేశ్వరుని ఆయన సాదనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పినమోని శ్రీనివాస్, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సీనీయర్ న్యాయవాదులు బాలి శివకుమార్, భవనప్ప, బొమ్మనెల్లి ప్రభాకర్, డీ. నర్సింగ్ రావు, ఘనాపూర్ శ్రావణ్ కుమార్, ఎడ్రామి విశ్వనాథ్, ఏజీపీ రవీందర్ రెడ్డి, న్యాయవాదులు బి.రవికుమార్, వెంకటేష్ గౌడ్, సర్సప్ప, సుదర్శన్, బందెప్ప, దేవరాజ్, ప్రకాష్, మహిళ న్యాయవాది శీతల్, వీరశైవ సమాజం కార్యదర్శి లింగదలి రవికుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26338/