శబరి సన్నిధిలో పైలెట్..!
May 15, 2024
dharshininews
శబరి సన్నిధిలో పైలెట్..!
- అయ్యప్పను దర్శించుకున్న రోహిత్ రెడ్డి
- తాండూరు ప్రజల కోసం వేడుకోలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శబరి మలై సన్నిధిలో వెలసిన అయ్యప్ప స్వామిని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. గత డిసెంబర్ తరువాత ఆలయాన్ని మూసివేశారు. తిరిగి శబరిమల ఆలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజీగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి తాజాగా శబరిమలలో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారని తెలిసి అక్కడికి బయల్దేరి వెళ్లారు.
బుధవారం ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామిని పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునట్టు ఆయన తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో గుర్వాయుర్ లో సామీ వారిని రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/26499/