schedule Tuesday, July 07, 2026

కరణించు వాసవీమాత..!

calendar_today May 17, 2024
person dharshininews
కరణించు వాసవీమాత..!
కరణించు వాసవీమాత..! - అమ్మవారి కృప అందరిపై ఉండాలి - బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : కరణ చూపించుకున్న వాసవీ కన్యకా పరమేశ్వరీ మాత అంటూ బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అమ్మవారిని వేడుకున్నారు. శుక్రవారం పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వాసవీ మాత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, నగరేశ్వర దేవాలయ పాలకవర్గం, వాసవీ మాత, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు నాగారం మల్లేశంకు హాజరయ్యారు. దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవీ మాత అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో అందరు సుఖసంతోషంగా జీవించాలని కోరినట్లు తెలిపారు. ఉత్సవాలల్లో తనను ఆహ్వానించడం పట్ల సంఘాల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, దేవాలయ పాలకవర్గ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26546/