schedule Tuesday, July 07, 2026

మంచ్‌ సేవలకు మెప్పు..!

calendar_today May 25, 2024
person dharshininews
మంచ్‌ సేవలకు మెప్పు..!
మంచ్‌ సేవలకు మెప్పు..! - రోజూ 3వేల మందికి మజ్జిగ వితరణ - 31 రోజులుగా సేవా కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ హిత కార్యక్రమాలలో ముందుండే తాండూరు మార్వాడి యువమంచ్‌ మరోసారి పేద ప్రజల మొప్పును సొంతం చేసుకుంది. గత ఐదేళ్లుగా ప్రతి యేడాది వేసవిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ సారి కూడా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉచిత మజ్జిగ వితరణ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గత 31 రోజులుగా నిరాకంటంగా మజ్జిగ వితరణ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, పాదా చారులు మార్వాడి యువమంచ్ దాతల సహాకారంతో అందిస్తున్న మజ్జిగ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా మాట్లాడుతూ గత 31 రోజులుగా ప్రతి రోజూ 3వేల మందికి ఉచితంగా మజ్జిగ వితరణ చేపట్టడం జరిగిందన్నారు. తాండూరు శాఖ అధ్యక్షులు అనిల్ సార్డా మాట్లాడుతూ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఉచితంగా మజ్జిగ వితరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందనతో పాటు వారి మెప్పును పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన దాతలకు, సమాజ పెద్దలకు, మంచ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ కుంజ్ బిహారి సోని, కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, క్యాంపు చైర్మన్ సునిల్ సార్డా, దినేష్‌ పర్తాని, రోహిత్ అగ్రవాల్, కృష్ణబూబ్, అభిలాష్‌ పండిత్, అశిష్‌ సార్డా, కృష్ణా బల్దావా తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26711/