schedule Tuesday, July 07, 2026

జర్నలిస్ట్ నరసింహారెడ్డికి నివాళులు..!

calendar_today May 27, 2024
person dharshininews
జర్నలిస్ట్ నరసింహారెడ్డికి నివాళులు..!
జర్నలిస్ట్ నరసింహారెడ్డికి నివాళులు..! - అంజలి ఘటించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ - ఆర్థిక సాయం అందించిన శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందిన తాండూర్ సీనియర్ జర్నలిస్ట్ గాజీపూర్ నరసింహారెడ్డికి టీయూడబ్ల్యూజే (iju) తాండూరు డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాక్షి రామకృష్ణ సోమవారం భౌతిక కాయంపై పూలమాలవేసి నివాళులర్పించారు. నరసింహారెడ్డి మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన మృతి పట్ల టీయూడబ్ల్యూజే ఐజేయూ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన జర్నలిస్టు నరసింహారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ తరపున త్వరలో ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆర్బీఓఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం. జర్నలిస్ట్ నరసింహారెడ్డి మృతి పట్ల ఆర్బీఓఎల్ సిఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహారెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఇలాంటి ఆపద సమయంలో ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటామన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26787/