schedule Friday, September 11, 2026

తాండూరులో కొత్త చట్టాల అమలు

calendar_today July 1, 2024
person dharshininews
తాండూరులో కొత్త చట్టాల అమలు
chai jr తాండూరులో కొత్త చట్టాల అమలు - ఫస్ట్‌ డే రెండు కేసుల నమోదు - వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త చట్టాలను తాండూరులో కూడా అమల్లోకి తీసుకవచ్చారు. సోమవారం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల కింద తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. సీఐ సంతోష్‌ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తాలోని యాక్సిస్ బ్యాంకు సమీపంలోని ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. బ్యాంకు మేనేజర్ పలయాద మంజుల ఫిర్యాదు మేరకు కొత్త చట్టం కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా తాండూరు తహసీల్దార్ కార్యాలయం మొదటి అంతస్తులోని సర్వేయర్ గదివద్ద అల్మారా, కుర్చీలను మాణిక్ నగర్కు చెందిన రవి ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి తహ సిల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలిపారు. తహసీల్దార్ తారాసింగ్ ఫిర్యాదు మేరకు కొత్త చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27517/