schedule Saturday, September 12, 2026

జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు

calendar_today August 10, 2024
person dharshininews
జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు
జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు - సీతారామ దేవాలయంలో శ్రావణ శోభ - భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని ప్రసిద్ద జుంటుపల్లి సీతారాముల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా యాలాల మండలంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు దేవాలయానికి తరలివచ్చారు. ఆలయంలో వెలసిన శ్రీ సీతారాములను భక్తిశ్రద్దలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలానికి భక్తులు పోటెత్తడంతో రాములోరి దేవాలయ ప్రాంగణంలో శ్రావణమాస సందడి ఏర్పడింది. అదేవిధంగా జుంటుపల్లి మార్గంలో ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తులు స్వామి వారిని దర్శించుకుని ఫోటోలు దిగారు. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటి ఆద్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చైర్మన్ హన్మంతరావు, డా.రవీందర్ రాము, జే.ప్రార్థసారధి రావుల సమక్షంలో ఇందనూర్ రవీందర్ గౌడ్ అన్నదానం నిర్వహించారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28234/