ఉర్సుకు ముర్షద్ దర్గా ముస్తాబు
August 12, 2024
dharshininews
ఉర్సుకు ముర్షద్ దర్గా ముస్తాబు
- 18 నుంచి ఉర్సేషరీఫ్ ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ముర్షాదర్గాలో ఈ నెల 18 నుంచి 78 ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తుట్లు నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్గని పాష ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీమ్ సాహెబ్ ఖిబ్లా చిప్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 78వ ఉర్సే షరీఫ్, హజ్రత్ అబ్దుల్ సలీం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 18 ఉర్సే షరీఫ్ ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. 18న ఆదివారం 7 గంటలకు వారి ఇంటి నుంచి సందల్ మాలి, 19న సోమవారం రాత్రి 8గంటలకు దీపోత్సవం, రాత్రి ఖవ్వాలి, 20న తేది నమాజ్ బాద్ ఫజర్ తిలావత్ ఖురన్పాక్, రాత్రి 8గంటలకు ఫాతేహఖ్వాని, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. కావున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని ఉర్సేషరీఫ్ను జయప్రదం చేయాలని కోరారు.
ఇదికూడా చదవండి..
https://www.dharshininews.com/28311/