schedule Tuesday, July 07, 2026

స్వచ్ఛత జవాన్లు కార్మికులే..!

calendar_today August 13, 2024
person dharshininews
స్వచ్ఛత జవాన్లు కార్మికులే..!
స్వచ్ఛత జవాన్లు కార్మికులే..! - ఘర్ ఘర్ తిరంగా జెండా ఎగురవేయాలి - బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం - మున్సిపల్ కార్మికులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే జవాన్లు మున్సిపల్ కార్మికులే అని బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. మంగళవారం తాండూరు పాత మున్సిపల్ కార్యాలయంలో నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఘర్ ఘర్ తిరంగాలో భాగంగా వారికి జాతీయ జెండాలను బహుకరించారు. ఈ సందర్భంగా నాగారం మల్లె శం, బీజేపీ నేతలు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య జవాన్లు కార్మికులే అని అన్నారు. కార్మికులు కూడా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేసి జాతీయ సమగ్రతను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర నాయకురాలు, కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, రమేష్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28321/