schedule Tuesday, July 07, 2026

విద్యార్థి దేశ భక్తి అలవర్చుకోవాలి

calendar_today August 15, 2024
person dharshininews
విద్యార్థి దేశ భక్తి అలవర్చుకోవాలి
విద్యార్థి దేశ భక్తి అలవర్చుకోవాలి - ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి - కేవీసీఎస్ లో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి విద్యార్థి దేశ భక్తిని అలవర్చుకోవాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ క్టరీ ఎండీ బుయ్యని సరళారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా హించారు. ఈ వేడుకలకు సరళా శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు దేశ భక్తిని అలవర్చుకొవాలన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల గురించి తెలుసుకోవాలన్నారు. దేశభక్తితో పాటు జాతీయ భావాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులతో స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ విద్యార్థులకు సరళా రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ క్రాంత్, డైరెక్టర్ సతీష్, యాజమాన్య కమిటి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28370/