schedule Tuesday, July 07, 2026

సాయి మేథాలో స్వాతంత్ర సంబరాలు

calendar_today August 15, 2024
person dharshininews
సాయి మేథాలో స్వాతంత్ర సంబరాలు
సాయి మేథాలో స్వాతంత్ర సంబరాలు - హాజరైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్ రెడ్డి పాల్గొని కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి ఘన నివాళులర్పించారు. విద్యార్థులకు దేశభక్తి, దైవభక్తితో చక్కటి విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల వేషాధారణ, దేశభక్తి సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28374/