schedule Friday, September 11, 2026

అమృత్ భారత్ పనుల్లో వేగం పెంచండి..!

calendar_today August 16, 2024
person dharshininews
అమృత్ భారత్ పనుల్లో వేగం పెంచండి..!
అమృత్ భారత్ పనుల్లో వేగం పెంచండి..! - పకడ్బందీగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి - ప్రయాణికులకు అసౌకర్యాలు లేకుండా చూడాలి - దక్షిణమధ్య రైల్వే శాఖ డీఆర్ఎం భర్తేష్ కుమార్ జైన్ - తాండూరు రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైల్వే స్టేషన్ ల ఆధునీకరణ పనులను వేగంతం చేయాలని దక్షణ మద్య రైల్వే శాఖ డీఆర్ఎం భర్తేష్ కుమార్ జైన్ ఆదేశించారు. శుక్రవారం దక్షణ మద్య రైల్వ శాఖ పరిధిలోని సేడం, తాండూరు రైల్వే స్టేషన్ లను ఆయన సందర్శించారు. రైల్వే శాఖ అధికారులతో కలిసి తాండూరు రైల్వే స్టేషన్లలోని పలు ప్రాంగణాలను పరిశీలించారు. దాదాపు రూ.27 కోట్లతో చేపడుతున్న అమృత్ భారత్ పనుల దశలను సవి లక్షించారు. ఇంత వరకు ఏయే పనులు చేపట్టారు. ఏయే దశలలో కొనసాగుతున్నాయని ఆరా తీశారు. వేయిటింగ్ హాల్, పార్కింగ్ స్థలం, ఎక్స్ లేటర్, టికెట్ బుకింగ్ హాల్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ పనుల వల్ల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమృత్ భారత్ పనులను నత్త సడకన చేయకుండా వేగం పెంచాలని సూచించారు. ఆయన వెంట రైల్వే అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28403/