schedule Tuesday, July 07, 2026

అజాత శత్రువు అటల్ వాజ్ పేయి

calendar_today August 16, 2024
person dharshininews
అజాత శత్రువు అటల్ వాజ్ పేయి
అజాత శత్రువు అటల్ వాజ్ పేయి - తాండూరులో బీజేపీ నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశం అభివృద్ధికి ఎంతో కృషి స మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అజాతీయ శత్రువుగా నిలిచారని తాండూరు బీజేపీ నేతలు అభివర్ణించారు. శుక్రవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారి వాజ్ పేయి వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం నర్సింలు తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వాజ్ పేయి నాయకత్వంలో భారత దేశం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. దేశ సేవకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప దేశ భక్తుడని కొ నియాడారు. అనేక దేశాల మద్య శాంతిని నెలకొల్పి ఆజాత శత్రువుగా నిలిచారని అభివర్ణించారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, ఓబీసీ మోర్చ కార్వయర్గ సభ్యులు గాజుల శాంతుకుమార్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, బూతు అధ్యక్షులు వడ్డె సాయిలు, బబ్లూ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28430/