కాళికాదేవి సేవలో సరళారెడ్డి
August 16, 2024
dharshininews
కాళికాదేవి సేవలో సరళారెడ్డి
- దేవాలయంలో ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కాళీకాదేవి అమ్మవారి సేవలో కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఎండీ బుయ్యని సరళారెడ్డి తరలించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్బంగా కాళీకాదేవి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి, పండితుల వేదమంత్రోచ్చరణలో కాళికాదేవికి సరళారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరు సుభిక్షంగా ఉండాలని, ప్రజలపై అమ్మవారి కృప మెండుగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/28433/