schedule Friday, September 11, 2026

సాయిమేధలో 'రక్షాబంధన్' వేడుకలు..

calendar_today August 17, 2024
person dharshininews
సాయిమేధలో 'రక్షాబంధన్' వేడుకలు..
సాయిమేధలో 'రక్షాబంధన్' వేడుకలు.. - ఒకరికొకరు రాఖీలు కట్టుకున్న విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపంగా భావించే రక్షాబంధన్ వేడుకను శనివారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో హిందు వాహిని, ఏబీవీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. ''నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనమందరము దేశానికి, ధర్మానికి రక్ష'' అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధన్ అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28455/