schedule Tuesday, July 07, 2026

చలో ఢిల్లీ..!

calendar_today August 27, 2024
person dharshininews
చలో ఢిల్లీ..!
చలో ఢిల్లీ..! - కేటీఆర్‌తో ఢిల్లీకి వెళ్లిన రోహిత్ రెడ్డి - కవితకు బెయిల్ రావడంతో సుప్రీం కోర్టు వద్ద సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. ఇందులో భాగంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఢిల్లీలో మెరిశారు. మంగళవారం సుప్రీం కోర్టులో మద్యం కేసుకు సంబంధించి కస్టడిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో సోమవారమే పార్టీ అగ్రనేత కేటీఆర్ తో కలిసి పైలెట్ రోహిత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం కవితకు బెయిల్ మంజూరు అయిన తరువాత సుప్రీం కోర్టు బయట జరిగిన సంబరాలలో కూడా రోహిత్ రెడ్డి అగ్రనేత కేటీఆర్ తో కలిసి ఉన్నారు. అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి ఇంట్లో కూడా కేటీఆర్ తో రోహిత్ రెడ్డి ఉన్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు..నియోజకవర్గంకు దూరంగా ఉంటూ వచ్చిన రోహిత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో సందడి చేేయడంతో ఆయన అభిమానులు, తాండూరు బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28593/