schedule Tuesday, July 07, 2026

ప్రణాళిక బద్ధంగా పట్టణాభివృద్ధి

calendar_today August 29, 2024
person dharshininews
ప్రణాళిక బద్ధంగా పట్టణాభివృద్ధి
ప్రణాళిక బద్ధంగా పట్టణాభివృద్ధి - దశల వారిగా వార్డుల సమస్యల పరిష్కారం - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ - 25వ వార్డులో సీసీ డ్రైన్ పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రణాళిక బద్ధంగా తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం పట్టణంలోని 25వ వార్డులో రూ. 10లక్షలతో చేపడుతున్న సీసీ డ్రైన్ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. దశల వారిగా వార్డుల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధి పనులతో అన్ని వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవి ధంగా కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే, చైర్ పర్సన్ సహాకారంతో అన్ని సమస్యలను పరిష్కరించేలా దృష్టిసారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఏఈ ఖాజా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, చెన్నారం శేఖర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28603/