schedule Tuesday, July 07, 2026

వాగుల వద్ద బందోబస్తు

calendar_today September 1, 2024
person dharshininews
వాగుల వద్ద బందోబస్తు
వాగుల వద్ద బందోబస్తు - దగ్గరుండి పర్యవేక్షించిన ఎస్ఐ విఠల్ రెడ్డి - వాగులు దాటకుండా చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కరణ్ కోట్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద బందోబస్తు నిర్వహిచారు. బెల్కటూర్, అల్లాపూర్ వాగులను సందర్శించి పరిశీలించారు. ఆయా వాగుల వద్ద వాహనాలు, ప్రజలు వాగులు దాటకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అటు వైపు, ఇటువైపు బారికేట్లను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, చెరువుల వద్దకు రావద్దని అన్నారు. వాగులు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాటిని దాటే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. అదేవిధంగా గ్రామాల్లో ఇండ్లలో ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ స్థంబాలు తాకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరోవైపు ఎస్ఐ విఠల్ రెడ్డి చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28659/