schedule Friday, September 11, 2026

ఏమాత్రం ఏమరుపాటు వద్దు..!

calendar_today September 1, 2024
person dharshininews
ఏమాత్రం ఏమరుపాటు వద్దు..!
ఏమాత్రం ఏమరుపాటు వద్దు..! - అందరికి అందుబాటులో ఉంటాం - కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - వర్షాభావ ప్రాంతాల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలతో ఎవ్వరు ఏమాత్రం ఏమరుమాటు వహించరాదని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు తదితరులతో కలిసి వర్షాల వద్ద ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాలను పరిశీలించారు. సాయిపూర్‌ లోని ఆదర్శ తులసీ నగర్, పాత కుంట, పాత తాండూరు తదితర ప్రాంతాలలో వరధనీటి ఇబ్బందులను పరిశీలించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు దైర్యంగా ఉండాలని అన్నారు. వర్షాలతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28669/