schedule Tuesday, July 07, 2026

కూలీన ఇండ్లకు ఆర్థిక సాయం ఖరారు

calendar_today September 3, 2024
person dharshininews
కూలీన ఇండ్లకు ఆర్థిక సాయం ఖరారు
కూలీన ఇండ్లకు ఆర్థిక సాయం ఖరారు - డివిజన్‌లో 27 ఇండ్లపై కలెక్టర్‌కు నివేధిక - వెల్లడించిన ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డివిజన్‌లో భారీ వర్షాలకు కూలిన ఇండ్లకు ఆర్థిక సాయంను నిర్ణయించారు. ఈ విషయాన్ని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా గత నెల 1వ తేది నుంచి ఈనెల 2వ తేది వరకు తాండూరు పట్టణంలో 3, పెద్దేముల్ మండలంలో 1, యాలాల మండలంలో 5, బొంరాస్‌పేట్‌లో 4, దౌల్తాబాద్‌ మండలంలో 6, బషీరాబాద్‌ మండలంలో 2, కోడంగల్‌లో 6 ఇండ్లు మొత్తం 27 ఇండ్లు కూలి పోయినట్లు తెలిపారు. కూలిన ఇండ్లకు ఆర్థిక సాయం అందించేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పరిశీలించినట్లు తెలిపారు. కూలిన ఇండ్లకు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి రూ. 4వేల చొప్పున సాయం అందించేలా జిల్లా కలెక్టర్ కు నివేధిక అందించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28706/