schedule Tuesday, July 07, 2026

గణేష్‌ నిమజ్జనంపై ఫోకస్..!

calendar_today September 8, 2024
person dharshininews
గణేష్‌ నిమజ్జనంపై ఫోకస్..!
గణేష్‌ నిమజ్జనంపై ఫోకస్..! - రేపు మండపాల నిర్వహకులతో సమావేశం - హాజరు కావాలన్న పట్టణ సీఐ సంతోష్‌కుమార్ తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసు శాఖ దృష్టిసారించింది. ప్రతి యేడాది నిమజ్జనం ఉత్సవాలకు పోలీసు శాఖ పటిష్టి చర్యలు తీసుకుంటోంంది. ఈ యేడాది కూడా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేపు మంగళవారం వినాయక మండపాల నిర్వహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండలంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుంతుందని వెల్లడించారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి పట్టణంలోని అన్ని వినాయకుల మండపాల నిర్వహకులు తప్పక హాజరు కావాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28831/