schedule Tuesday, July 07, 2026

జిల్లా ఆసుపత్రిలో వినాయక శోభ..!

calendar_today September 10, 2024
person dharshininews
జిల్లా ఆసుపత్రిలో వినాయక శోభ..!
జిల్లా ఆసుపత్రిలో వినాయక శోభ..! - గణనాధునికి పూజలు చేసిన వైద్యులు, సిబ్బంది - ఆసుపత్రి ఆవరణలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వినాయక శోభ సంతరించుకుంది. వినాయక చవితిని పురస్కరించుకుని ఆసుపత్రి ఆవరణలో ప్రతిష్టించిన వినాయకునికి మంగళవారం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజులుగా వినాయకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, బందువులు వినాయకున్ని దర్శించుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ఆసుపత్రికి చెందిన సిబ్బంది ఇందర్‌చెడ్‌ రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలందరిపై వినాయకుని కృప సిద్దించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొని అన్నదానం చేశారు. పూజలు, అన్నదాన కార్యక్రమాలతో ఆసుపత్రిలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28908/