schedule Tuesday, July 07, 2026

భక్తిభావం.. సేవాభావం..!

calendar_today September 10, 2024
person dharshininews
భక్తిభావం.. సేవాభావం..!
భక్తిభావం.. సేవాభావం..! - వినాయక మండపం వద్ద రక్తదానం - మనసు గెలుసుకున్న జనసేన యువకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తిభావంతో పాటు తమలో సేవాభావం కూడా ఉందని తాండూరు యువత నిరూపించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో మండపం వద్ద రక్తదానం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన విరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం కన్యాపాఠశాల ప్రాంతానికి చెందిన యువత జనసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకున్ని ప్రతిష్టించారు. నాలుగు రోజులుగా వినాయకునికి పూజలు నిర్వహిస్తూ భక్తిభావంను చాటుకున్నారు. నాలుగోరోజు మంగళవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వారి సహాకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే రక్తదానం చేసి సేవాభావంను కూడా చాటుకున్నారు. జనసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంకు విశేష స్పందన లభించడంతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. రక్తదానం తరువాత ఆసుపత్రి వైద్య బృందం యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28922/